తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం..

440
mp venkatesh
- Advertisement -

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్‌లో సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్నవారికీ పట్టాల పంపిణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి,ఎంపీ డా.బోర్లకుంట వెంకటేష్ నేత,ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్,మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు,జిల్లా గ్రంధాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్,తెరాస సభ్యత్వ నమోదు ఇంచార్జీ మూల విజయారెడ్డి,సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమలో ఎంపీ డా.వెంకటేష్ నేత మాట్లాడుతూ.. నేను ఎంపీగా గెలిచిన తర్వాత సింగరేణి స్థలాల్లో నివాసముంటున్న వారికీ ఇండ్ల పట్టాల పంపిణి కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా.. సింగరేణికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలనన్నింటిని సీఎం కేసీఆర్‌ నెరవేరుస్తున్నారని ఎంపీ అన్నారు. తెలంగాణాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలోని పలు పథకాలను కేంద్రం ఆదర్శంగా తీసుకోని అమలుచేస్తున్నదని ఎంపీ వెంకటేష్‌ తెలిపారు.

ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ మాట్లాడుతూ.. సింగరేణి స్థలాల్లో నివాసముంటున్న వారికి ఇండ్ల పట్టాలివ్వడం సీఎం కేసీఆర్‌ సాహసోపేత,చారిత్రాత్మక నిర్ణయమన్నారు. నాటి సమైక్యపాలనలో జాతీయ కార్మిక సంఘాలు ఏనాడు కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని సతీష్‌ కుమార్‌ తెలిపారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ.. దశాబ్దాల కార్మికుల కల సింగరేణిలో ఇండ్ల పట్టాలిచ్చిన సీఎం కేసీఆర్‌కి కార్మికుల పక్షాన కృతఙ్ఞతలు అన్నారు.

- Advertisement -