సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీపీటీసీ ల వేతనాలు విడుదల

466
GramPanchayats
- Advertisement -

సర్పంచ్ , ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు శుభవార్త తెలిపింది తెలంగాణ సర్కార్. గౌరవ వేతనాలకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. గౌరవవేతనాల బకాయిలు రూ.32 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. రూ.32,19,45,000 సత్వరమే పంపిణీ చేయాలని పంచాయతీరాజ్‌శాఖ ఆయా జిల్లా అధికారులను ఆదేశించారు.

గౌరవవేతనాలను విడుదల చేయడంపై స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -