ఆధారాలు లేకుండా వార్తలు రాయడం కరెక్ట్ కాదు

181

ఎలాంటి ఆధారాలు లేకుండా పత్రికలు వార్తలు రాయడం కరెక్ట్ కాదన్నారు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ. దేశంలోనే గొప్ప పోలీస్ వ్యవస్థ తెలంగాణలో ఉందన్నారు. తెలంగాణ పోలీస్ వ్యవస్ధపై ఈనాడు పేపర్ లో వచ్చిన కథనంపై మంత్రి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణ వచ్చాక మొదటి ప్రాధాన్యత పోలీస్ శాఖకు ఇచ్చారన్నారు. తెలంగాణ పోలీస్ లు బాగా పని చేస్తున్నారన ఇతర రాష్ట్రాల వారు తనతో చెబుతున్నారు. దేశంలోనే ఎక్కడ లేనివిధంగా సిసి కెమెరా లు మన రాష్ట్రంలో ఉన్నాయి.ఈనాడు వాళ్ళు అనవసర రాతలు రాశారు.

తెలంగాణ పోలీస్ లు 24 గంటల సర్వీస్ చేస్తున్నారు. హైదరాబాద్ చాలా శాంతియుతంగా ఉంది. అనేక విదేశీ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టారు. దొంగల తో దోస్తీ అని రాశారు ఎక్కడ ఉన్నాయి ఆధారాలు చూపెట్టాలని ఈనాడు ఎడిటర్ కు విజ్నత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఆధారాలు ఉంటే చూపెట్టండి లేదు అంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి రాతలు రాయడం వలన రాష్ట్రం ఇమేజ్ దెబ్బతింటుందన్నారు. సీఎం కేసీఆర్ పోలీస్ వ్యవస్థ పై అనేక సంస్కరణలు తెచ్చారన్నారు. ఆధారాలు చూపెట్టకపోతే ఈనాడు సంస్ధపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు.