రైతుబంధు, రైతు భీమా పథకాలు దేశానికే ఆదర్శంః హోం మంత్రి

330
Mahmood-Ali
- Advertisement -

ఇటివలే జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక స్ధానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటివలే కో ఆప్షన్ సభ్యులను కూడా ఎన్నుకొన్నారు. ఇవాళ వరంగల్ అర్భన్ జిల్లా హన్మకొండలో కో అప్షన్ సభ్యులను సన్మానించారు హోం మంత్రి మహముద్ అలీ. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్ధానిక సంస్ధల కో ఆప్షన్ సభ్యులుగా మైనార్టీలకు అవకాశం కల్పించింనందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణలో క్రైం రేటు చాలా తగ్గిందని చెప్పారు. రైతు బంధు, రైతు భీమా పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. హాసన్ పర్తి పోలీస్ స్టేషన్ హైటెక్ సిటీ తరహాలో ఉందని కొనియాడారు. కేసీఆర్ ప్రభుత్వంలో నాకు సరైన సముచిత స్ధానం కల్పించారని తెలిపారు.

ఫ్రెండ్లీ పోలిసింగ్ విధానం వల్ల పోలీసులకు ప్రజలకు మధ్య స్నేహ పూర్వక వాతావరణం ఏర్పాట చేస్తామని చెప్పారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క గంటసేపు కూడా కర్ఫూ విధించలేదని చెప్పారు. ఈకార్యక్రమంలో హోం మంత్రితో పాటు ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మేయర్ గుండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, సతీష్ బాబు పాల్గోన్నారు.

- Advertisement -