జాగ్రత్త.. ‘హైటెక్ కిల్లర్’ వస్తున్నాడు!

50

జాతీయ బాడి బిల్డర్ బల్వాన్ హీరోగా ఎస్ ఎం ఎం ఖాజా దర్శకత్వంలో మజ్ను సాహెబ్ మూవీస్, సోహ్రాబ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం హైటెక్ కిల్లర్. షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ చిత్రం మే 1న విడుదలకు సిద్ధం అయింది. ఈ సందర్బంగా చిత్ర వివరాలను గురించి నిర్మాతలు తెలియచేస్తూ .. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న హైటెక్ కిల్లర్ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంటుంది. ఇటీవలే ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తీ చేసుకుంది. రెండు పాటలు మిగిలి ఉన్నాయి. వాటిని త్వరలోనే చిత్రీకరించనున్నాం. శివరంజని మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలు మంచి క్రేజ్ తెచ్చుకుని సినిమాపై అంచనాలు పెంచాయి.

Hitech Killer

ఈ చిత్రానికి ఎస్ కె మజ్ను అందించిన సంగీతం హైలెట్ గా నిలుస్తుంది. ముఖ్యంగా ప్రముఖ గాయకుడూ ఎస్పీ బాలు పాడిన ఆటోవాలా సాంగ్ హైలెట్ అయింది. అరాచకాలు, అన్యాయాలు చేస్తూ మాఫియా డాన్ గా మారిన వ్యక్తిని ఎలా చివరికి పోలీసులు అంతమొందించారు అన్న కథతో తెరకెక్కింది. హైటెక్ కిల్లర్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే డే సందర్బంగా మే 1న విడుదల చేస్తాం. హైటెక్ కిల్లర్ ను ఆసక్తికర కథతో పక్కా కమర్షియల్ హంగులతో రూపొందించాం. దీనికి సీక్వెల్ గా హీమాన్ అనే పేరుతొ మరో సినిమా కూడా తెరకెక్కిస్తున్నాం. దాన్ని రంజాన్ కానుకగా విడుదల చేస్తామన్నారు.

బల్వాన్, శ్రావణి, సత్యప్రకాష్, అన్నపూర్ణమ్మ, జీవా, కవిత, ప్రసన్న కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : యాదగిరి, డాన్స్ : బ్రదర్ ఆనంద్, ఫైట్స్ : సూపర్ ఆనంద్, ఎడిటింగ్ – ఆర్ట్ – ఎగ్జిక్యూటివ్ నిర్మాత : షేక్ మహ్మద్ , సంగీతం : ఎస్ కె మజ్ను, నిర్మాత : మజ్ను రెహాన్ బేగం. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, పాటలు , దర్శకత్వం : ఎస్ ఎం ఎం ఖాజ.