బిగ్ బాస్3… రాహుల్ రీ ఎంట్రీ.. హిమజ అవుట్

231
himaja
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 3 ఆసక్తికరంగా కొనసాగుతుంది. ఇప్పటికి 8వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 3 కి ప్రేక్షకుల నుంచి అద్బుతమైన స్పందన వస్తోంది. అయితే ప్రతీవారం ఒకే వ్యక్తి ఎలిమినేషన్ అవుతారు. అయితే ప్రతిసారి ఏదో ఒక రకంగా ఎలిమినెట్ అయ్యే వారి పేర్లు ముందే ప్రచారం జరగడంతో లీకు రాయుళ్లకు షాక్ ఇచ్చారు బిగ్ బాస్.

ఈవారం రెండు ఎలిమినేషన్ లు ఉంటాయని చెప్పాడు. దీనిలో భాగంగా శనివారం రాహుల్ ని ఎలిమినెట్ చేశారు. అయితే రాహుల్ ది ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పారు నాగార్జున. రాహుల్ ని డార్క్ రూమ్ లోకి పంపిచారు. దీంతో ఆదివారం ఎపిసోడ్ కూడా చాలా ఫన్ని గా గడిచిపోయింది.

వాల్మీకి హీరో వరుణ్ తేజ్ ఈఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చి హౌస్ మెట్స్ తో కాసేపు సరదాగా గడిపారు. ఇక ఈవారం ఎలిమేషన్ లో భాగంగా ఇద్దరు వ్యక్తులు నామినేషన్స్ లో ఉన్నారు. మహేశ్, హిమజలో నుంచి ఈవారంలో ఎవరో ఒకరు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అందరి అంచనాల ప్రకారమే హిమజ ఎలిమినెట్ అయ్యింది. అయితే రాహుల్ ను మరో రెండు రోజుల తర్వాత హౌస్ లోకి పంపించనున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -