వివాదంలో వాల్మీకి…మెగా హీరోకు కోర్టు నోటిసులు

243
varun tej valmiki

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వాల్మీకి. ఇటివలే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తమిళ్ లో ఘన విజయం సాధించిన జిగార్తాండ మూవీకి ఇది రిమేక్ గా తెరకెక్కించారు. వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డె నటించింది.

ఇక ఈమూవీ టైటిల్ పై కొద్ది రోజులుగా వివాదం జరుగుతుంది. వాల్మీకి టైటిల్ మార్చాల్సిందేని బోయ హక్కుల పోరాట సమితి పోరాటం కొనసాగిస్తోంది. దీనిపై వారు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయగా, తాజాగా ఆ పిటిషన్ పై విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో, హైకోర్టు వాల్మీకి హీరో వరుణ్ తేజ్ తో పాటు, చిత్ర యూనిట్ కు, రాష్ట్ర డీజీపీకి, సెన్సార్ బోర్డుకు, ఫిలించాంబర్ కు నోటీసులు జారీ చేసింది.

4 వారాల్లో ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ మరో నెలరోజుల తర్వాత ఉంటుందని పేర్కొంది. ఈవివాదంపై చిత్రయూనిట్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.  ఇప్పటికే వాల్మీకి మూవీని సెప్టెంబర్ 20న ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్. మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని 14రీల్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.