త్రివిక్రమ్ ఈ సంక్రాంతికైనా హిట్ కొడతాడా..?

524
trivikram srinivas
- Advertisement -

ర‌చ‌యిత‌గా కెరీర్ మొద‌లుపెట్టి టాలీవుడ్ లో టాప్ డైరెక్ట‌ర్ రేంజ్ కు ఎదిగాడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్. టాప్ హీరోల‌తో సినిమా తీసి మంచి హిట్లు అందించాడు. అంతేగాదు త్రివిక్రమ్ మాటలు,డైలాగ్‌లు ఇప్పటకి ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తాయి.

అయితే ఎంత హిట్‌లు సాధించినా,పవర్ ఫుల్ డైలాగ్లు రాసినా అప్పుడప్పుడు వచ్చే ఫ్లాప్‌లు చాలాకాలం వెంటాడుతూనే ఉంటాయి. త్రివిక్రమ్ కెరీర్‌లో అలాంటి ఫ్లాప్ మూవీనే అజ్ఞాతవాసి. పవన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా 2018 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకువచ్చింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. త్రివిక్రమ్-పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

2018 తర్వాత అరవింద సమేతతో హిట్ కొట్టిన త్రివిక్రమ్ తాజాగా అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురములో అంటూ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానున్నాడు. ఇప్పటికే మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొనగా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ సంక్రాంతికైనా త్రివిక్రమ్ హిట్ కొడతాడా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే త్రివిక్రమ్ మాత్రం అజ్ఞాతవాసితో తన ఇమేజ్‌కు ఏర్పడ్డ డ్యామేజ్‌ను పూడ్చే కసితోనే సంక్రాంతికి ప్రేక్షకుల ముందున్న వస్తున్న టాక్.

- Advertisement -