ఆ విషయం బయటకు ఎలా వచ్చిందొ నాకు తెలియదుః సాయి పల్లవి

57
sai pallavi

మలయాళ బ్యూటి సాయి పల్లవి తెలుగు, మలయాళ సినిమాల్లో చాలా బిజీగా ఉంది. ఆమె సినిమాల్లో ఎంత బిజీగా ఉందో ఆమెపై రూమర్లు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. తమిళ దర్శకుడు విజయ్ తో సాయి పల్లవి డేటింగ్ ఉందని ఇటివలే సోషల్ మీడియాలో పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదన్నారు దర్శకుడు విజయ్. అయితే సాయి పల్లవి తెలుగులో చివరగా శర్వానంద్ తో పడిపడి లేచేమనసు సినిమాలో నటించింది.

padi padi leche manasu

హను రాఘవపూడి తెరకెక్కించిన ఈచిత్రం అంతగా ఆడలేదు. సాయి పల్లవి, శర్వానంద్ నటనకు మంచి మార్కులే పడినా..కథ స్లో గా ఉండటంతో బాక్సాఫిస్ వద్ద బొక్కా బొర్లా పడింది. ఈసినిమా వల్ల నిర్మాతలకి కూడా నష్టం వచ్చిందని సమాచారం. ఈవిషయం సాయి పల్లవికి తెలియడంతో తన రెమ్యూనరేషన్ ని తిరిగి ఇచ్చేసిందని వార్తలు వచ్చాయి. అయితే ఈవిషయంపై సాయి పల్లవి స్పందించింది. పడిపడి లేచేమనసు సినిమా కోసం సంవత్సరం పాటు కష్టపడ్డాం..సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందనుకున్నాం..కానీ అనుకున్నంత విజయం సాధించలేదని చెప్పింది.

అప్పుడు తన రెమ్యూనరేషన్ ను నిర్మాత సుధాకర్ రెడ్డికి ఇచ్చేయాలనే నిర్ణయం తీసుకున్నాను..అందుకు ఆయన అంగీకరించలేదు. ఇచ్చిన రెమ్యూనరేషన్ తిరిగి తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెబుతూ ఈ మొత్తం త‌దుప‌రి చిత్రానికి అడ్వాన్స్‌గా భావించండని సాయి ప‌ల్ల‌వితో అన్నాడ‌ట సుధాక‌ర్‌. ఈవిషయం మా ఇద్దరి మధ్యే డిస్కషన్ జరిగిందని..ఆ విషయం బయటకు ఎలా వచ్చిందో తనకు ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పింది సాయి పల్లవి.