సినిమాలు మానేసి చదువుకోమంటున్నారుః ప్రియా వారియర్

62
Priya Warrior

ప్రియా ప్రకాశ్ వారియర్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయినవారిలో ముందు వరుసలో ఉంటుందని చెప్పుకోవాలి. ఆమె నటించిన ఒరు ఆడార్ లవ్ చిత్రం ప్లాప్ గా మిగిలిన ఆమెకు అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. తెలుగులో లవర్స్ డే గా ఈసినిమా విడుదల అయింది. బాలీవుడ్ లో కూడా అమ్మడు కు బాగానే అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె నటించిన శ్రీదేవి బంగ్లా సినిమా త్వరలోనే విడుదల కానుంది.

ఈసినిమా ప్రమోషన్స్ లో ఆమె తన చుదవు గురించి చెప్పింది. అయితే ఆమె నటిగా కంటే చదువుకుంటేనే బాగుంటుందని తన టీచర్లు అభిప్రాయపడుతున్నారని చెప్పింది. చదువును మధ్యలోనే ఆపాలని తన తల్లితండ్రులు ఎప్పుడూ చెప్పలేదని, అలా చేయడం వారికి ఇష్టం లేదని తెలిపింది. మరో ఏడాదిలో డిగ్రీ పట్టా అందుకుంటానని, అప్పుడు పూర్తిగా సినిమాలపై దృష్టి సారించవచ్చని చెప్పింది. తనకు చదువు కంటే నటనపైనే ఎక్కువ ఆసక్తి ఉందని తెలిపింది.