బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన పూజా హెగ్డె

140
Pooja HedgePooja Hedge

ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డె ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. కెరీర్ మొదట్లో అవకాశాలు కాస్త తక్కువే వచ్చినా ఇప్పుడు మళ్లీ కుదురుకుంది. ముకుంద సినిమా తర్వాత అమ్మడుకు బాలీవుడ్ లో అవకాశం వచ్చింది. దీంతో అప్పుడు తెలుగులో సినిమాలకు నో చెప్పింది. బాలీవుడ్ లో ఆమె నటించిన సినిమా డిజాస్టర్ కావడంతో అక్కడ కూడా పెద్దగా అవకాశాలు రాలేదు.

Pooja-Hegde

దీంతో అమ్మడు మళ్లీ టాలీవుడ్ పై కన్నేసింది. అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటించి మళ్లీ టాప్ రేంజ్ కు ఎదిగింది. ప్రస్తుతం అమ్మడు టాలీవుడ్ టాప్ హీరోయిలతో బిజీగా ఉంది. పూజాకు తాజాగా మరో బంపర్ ఆఫర్ వచ్చింది. వరుణ్ ధావన్, సైఫ్ అలీఖాన్ సరసన ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కటి విజయం సాధించిన ఆమె టాలీవుడ్ కు గుడ్ బై చెప్పినట్లే అనుకోవచ్చు. .