‘టాక్సీవాలా’కు సూర్య సపోర్ట్‌..

258
Taxiwala movie
- Advertisement -

టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’. ఈ సినిమాకి రాహుల్‌ దర్శకత్వం వహించారు. ప్రియాంక జవాల్కర్‌ కథానాయిక. జీఏ2, యూవీ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవంబర్‌ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే విజయ్‌ నటించిన ‘టాక్సీవాలా’ పైరసీకి గురైన సంగతి తెలిసిందే. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తికాకుండా సినిమా మొత్తం ఆన్‌లైన్‌లో లీక్‌ కావడంతో విజయ్‌ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

Taxiwala

కాగా..ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. యూట్యూబ్‌లో ట్రైలర్‌ను దాదాపు 40 లక్షల మంది వీక్షించారు. ఈ విషయాన్ని విజయ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ..అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ‘నేను బాధలో ఉన్నప్పుడు నాకు బలాన్ని ఇచ్చేదెవరో తెలుసా? మీరే. నా చుట్టూ ఉన్న శబ్దంలో మీ ప్రేమే నాకు గట్టిగా వినిపిస్తుంది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయితే విజయ్‌ చేసిన ట్వీట్‌పై ప్రముఖ తమిళ హీరో సూర్య స్పందించారు. ‘నీకు మా అందరి ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇవేవీ శాశ్వతం కావు. కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ ఇక్కడే ఉంటావు. ‘టాక్సీవాలా’ సినిమా కోసం నేను చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.’ అని ట్వీట్‌ చేశారు. ఇందుకు విజయ్‌ ప్రతిస్పందిస్తూ..‘లవ్యూ సూర్య సర్‌’ అన్నారు. సూర్య ‘ఎన్‌జీకే’ చిత్రంతో బిజీగా ఉన్నారు. సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు.

- Advertisement -