ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా…?

463
hero sudeer babu

అతడో టాలీవుడ్ హీరో. చిటికెస్తే పనిమనుషులు..కానీ ఆ హీరో రోడ్డుపై కారు తోస్తు కనిపించడం ఇదంతా చూసే వారికి కాస్త విడ్డూరంగానే అనిపించిన…ఆ హీరో షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరా ఆహీరో అనుకుంటున్నారా…?ఆయనే సుధీర్ బాబు.

ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నేచురల్ స్టార్ నానితో కలిసి వీ సినిమా చేస్తున్నాడు సుధీర్ బాబు. ఈసినిమా కోసం వర్కవుట్‌లో భాగంగా ఆగిఉన్న కారును తోస్తూ కనిపించాడు.

వర్కవుట్ ఎప్పుడూ రోటీన్‌గా, బోరింగ్‌గా ఉండడం మా ట్రైనర్ జాఫర్ అలీకి నచ్చలేదు. అందుకే నా వర్కవుట్‌ను సరికొత్తగా, ఆసక్తికరంగా మార్చాడు. రోడ్డుపై నా కారును నా చేత తోయించాడు అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. మీ శరీరంలో కొంత ఇంధనం వేసుకుని మీ కారును ముందుకు తీసుకెళ్లండని తెలిపాడు.

నాని,సుధీర్‌బాబు సరసన అదితిరావు హైద‌రి, నివేదా థామ‌స్ హీరోయిన్లుగా నటిస్తుండగా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్‌, ల‌క్ష్మ‌న్‌, హ‌ర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.