ఇస్మార్ట్ శంక‌ర్ తో మారుతి

308
- Advertisement -

హీరో రామ్ పొత్తినేని ప్ర‌స్తుతం రెడ్ మూవీలో న‌టిస్తున్నారు. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈమూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న మూడో సినిమా ఇది. తొలిసారిగా రామ్ యాక్ష‌న్ మూవీలో న‌టిస్తున్నాడు. ఈమూవీలో రామ్ స‌ర‌స‌న అమృత అయ్యార్, హెబ్బా పాటిల్ , నివేధా పేతురాజ్ లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఈ మూవీ త‌ర్వాత రామ్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు. రామ్ కోసం మారుతి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను సిద్ధం చేశాడట. మారుతి తెర‌కెక్కించిన ప్ర‌తిరోజూ పండ‌గే సినిమా మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈమూవీకి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియ‌నున్నాయి. ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో త‌న కెరీర్ లోనే భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు రామ్.

- Advertisement -