ఇస్మార్ట్ సెలబ్రేషన్స్‌లో ఉస్తాద్ శంకర్‌

483
hero ram
- Advertisement -

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌-ఎన‌ర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్. చాలాకాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన పూరి…వసూళ్లలో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ఈ నేప‌థ్యంలో కొద్ది రోజులుగా చిత్ర బృందం ప‌లు ప్రాంతాల‌లో స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకుంటుంది.

తాజాగా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు హీరో రామ్‌. పూరీతో పాటు ఛార్మి ఇతర చిత్ర యూనిట్ ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేశారు ఛార్మి. ఉస్తాద్ వచ్చాడు…ఇది సెలబ్రేషన్‌ టైమ్‌ అంటూ ట్వీట్ చేశారు.

తొలుత ఇస్మార్ట్ శంక‌ర్ జూలై 12న విడుద‌ల చేయాలని భావించారు. దీంతో రామ్ 12 త‌ర్వాత త‌న ఫ్యామిలీతో క‌లిసి స్పెయిన్ వెళ్ల‌డానికి ప్లాన్ చేసుకున్నాడు. అన్ని బుకింగ్స్ కూడా పూర్తి చేశాడు. కాని రిలీజ్ డేట్ 18కి పోస్ట్ పోన్ అయ్యే స‌రికి రామ్ ప్ర‌మోష‌న్స్‌లో, స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన‌లేక‌పోయాడు. దీంతో హీరో రామ్‌-పూరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు రాగా వాటికి చెక్ పెట్టారు ఉస్తాద్ శంకర్‌.

- Advertisement -