అల్లు అర్జున్ కు స్పెషల్ గిప్ట్ ఇచ్చిన నవదీప్

608
Navadep Special Gift To Allu Arjun
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , హీరో నవదీప్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. ఆర్య2 సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు. తాజాగా బన్నీకి సర్ ప్రైజ్ గిప్ట్ ఇచ్చాడు నవదీప్. ఆ గిఫ్ట్ ఎంటంటే రుద్ర‌మ‌దేవి చిత్రంలో గోన‌గ‌న్నారెడ్డి పాత్ర మాదిరిగా బ‌న్నీ స్టాచ్యూని చేయించి బ‌హుమ‌తిగా ఇచ్చాడు న‌వ‌దీప్‌. బావ‌కి ప్రేమ‌తో ఓ చిరు కానుక అంటూ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

దీనికి బ‌న్నీ రిప్లై ఇస్తూ త‌ను అందుకున్న స్వీటెస్ట్ గిఫ్ట్ అని ఆ స్టాచ్యూ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. వీరిద్దరి మ‌ధ్య స్నేహాన్ని చూసి అభిమానులు మురిసి పోతున్నారు. రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆసినిమాలో తెలంగాణ భాషలో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు బన్నీ. ఇక బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో నవదీప్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. దసరా సెలవుల్లో ఈసినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్.

- Advertisement -