రామ్ చరణ్‌ దర్శకుడితో నందమూరి హీరో

116
sampath-nandi

నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్ ప్రస్తుతం తుగ్లక్ సినిమాలో నటిస్తున్నాడు. ఈచిత్రం తర్వాత ఆయన రచ్చ సినిమా దర్శకుడు సంపత్ నందితో సినిమా చేయనున్నాడు. కళ్యాణ్‌ రామ్ కోసం సంపత్ నంది మంచి కథను రెడీ చేసినట్లు సమచారం. ప్రస్తుతం ఈ ప్రాజక్ట్ కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. త్వరలోనే ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుందని తెలుస్తుంది. సంపత్ నంది గోపిచంద్ తో సినిమా చేయాల్సి ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల అది క్యానల్ అయింది.

ఇక సంపత్ నంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రచ్చ సినిమా చేశాడు ఈసినిమా పర్వాలేదు అనిపించింది. ఇక ఆయన ఇటివలే నిర్మాతగా కూడా మారాడు. చిన్న సినిమాలు తిస్తూ నిర్మాతగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటివలే వచ్చిన పేపర్ బాయ్ చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరించాడు. ఈసినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక కళ్యాణ్ రామ్ ఇటివలే 118సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు.