రివ్యూః 90ఎంఎల్

1605
90ml
- Advertisement -

యువ హీరో కార్తికేయ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 90ఎంఎల్ . నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు యెర్రా శేఖర్ రెడ్డి తెరకెక్కించారు. కార్తికేయ కు ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నిర్మాణ సంస్థ కార్తికేయ క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో నిర్మించారు. కార్తికేయ నటించిన మొదటి సినిమా ఆర్ఎక్స్ 100తర్వాత ఆ రేంజ్ లో హిట్ అయిన సినిమా ఇప్పటికి రాలేదు. 90ఎంఎల్ మూవీ ఈనెల 5న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈసినిమాను ఒక రోజు తర్వాత ఇవాళ విడుదల చేశారు. ఇంతకి ఈ 90ఎంఎల్ మూవీ ఎలా ఉందో..ప్రేక్షకులకు కిక్కు ఎక్కించిందో లేదో చూద్దాం…

90ml MOvie

కథః
కార్తికేయ (దేవదాస్) కు పుట్టుకతోనే ఓ అరుదైన వ్యాధి ఉంటుంది. దానికి ఉపశమనంగా దేవదాస్ ప్రతిపూటా ఓ 90ఎంఎల్ ఆల్కహాల్ తీసుకోవాలని అతనికి ఆధరైజ్డ్ డ్రింకర్ సర్టిఫికెట్ ఇస్తాడు డాక్టర్.అలా పెరిగి పెద్దవాడయిన దేవదాసుకి రోజుకి మూడు పూటలా కూడా 90ML తాగాల్సి ఉంటుంది. ఒక వేళ అలా తాగకపోతే అతని ప్రాణాలు పోయే పరిస్ధితి ఉంది. అలాంటి అతను సువాసన(నేహా సోలంకి)ని చూసి ప్రేమలో పడతాడు. కానీ నేహా సోలంకి ఫ్యామిలీకి అసలు మద్యం అంటేనే పడదు. ఆమె ఫ్యామిలీకి మాత్రం అసలు అలాంటి అలవాట్లు ఉన్నవాళ్లు నచ్చరు. కానీ దేవదాసు రోజు 90ML తాగుతాడు అనే విషయం తెలియక అతనితో ప్రేమలో పడుతుంది. చివరకి దేవదాస్ కి మద్యం అలవాటు ఉందని సోలంకికి తెలిసిపోతుంది. దేవదాస్ కి మందు తాగే అలవాటున్న విషయం తన దగ్గర దాచాడన్న కోపంతో సువాసన దేవదాస్ ని వదిలి వెళ్ళిపోతుంది. మరి మందు తాగితేనే బ్రతక గల దేవదాస్ సువాసన ప్రేమ కోసం మందు వదిలేశాడా? దేవదాస్ లోపాన్ని అర్థం చేసుకొని సుహాసన అతని ప్రేమను అంగీకరించిందా? అనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ః

కార్తికేయ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో తన నటనను మెరుగుపరుచుకున్నాడు కార్తికేయ. కామెడీ టైమింగ్ పర్లేదు అనిపించింది. ఇక కొత్త హీరోయిన్ నేహా సోలంకి ఉన్నంతలో బాగానే చేసింది. ఆమెది కాస్త పాసివ్ క్యారెక్టర్ కావడంతో పెద్దగా నటించాల్సిన అవసరంలేదు. రోలర్ రఘు కామెడీ బాగానే పేలింది. రాప్ సింగర్‌ రోల్ రైడా ఈ సినిమాలో హీరో పక్కనే కామెడీ పండించే పాత్రలో బాగానే నటించాడు. డైరెక్టర్ శేఖర్ రెడ్డి టేకింగ్ చాలా బాగుంది. కొత్త దర్శకుడు అయిన బాగానే తీశాడు. అనుప్ రూబెన్స్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్లస్ గా మారింది. ఈమూవీలో 3 పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలరించింది. నిర్మాణ విలువలు సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. నిర్మాతలు ఎక్కడ రాజీపడకుండా సినిమాను నిర్మించారు.

90ML-

మైనస్ పాయింట్స్ః

సినిమా కథ పర్లేదు అనిపించినా స్క్రీప్ ప్లే కొత్తగా లేకపోవడం అనేది సినిమాకు మైనస్ గా చెప్పుకోవచ్చు..పాట, ఫైట్ మధ్యలో అక్కడక్కడా కామెడీ అన్నట్లుగా సినిమా నడిపించారు. హీరో చేసే భీకరమైన ఫైట్స్ కి బలమైన కారణం లేకపోవడం. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ మరియు మందు అలవాటు వలన ప్రేమికుల మధ్య ఏర్పడే బ్రేక్ అప్ సన్నివేశాలు ఇంకా కొంచెం బలమైన సన్నివేశాలతో తెరకెక్కించాల్సింది.

తీర్పుః
యంగ్ హీరో కార్తికేయ 90ఎం ఎల్ లో ప్రేక్షకులకి సరిపడా కిక్ ఇవ్వలేదని చెప్పాలి. స్టొరీ బానే ఉన్న స్క్రీప్లే కాస్త బెటర్ గా ఉంటే బాగుండేది అనిపించింది. అనూప్ రూబెన్స్ సాంగ్స్, అక్కడక్కడా నవ్వించే కామెడీ కొంత ఉపశమనం కలిగిస్తుంది.కేవలం కార్తికేయ స్క్రీన్ ప్రెజెన్స్, పోరాటాలు ఇష్టపడే వారికి 90ఎం ఎల్ నచ్చుతుంది. సెకండాఫ్ కూడా ఫస్టాఫ్ లో ఉన్నట్టు ఉండుంటే మాత్రం కార్తికేయ హిట్ కొట్టేవాడు అని చెప్పుకోవచ్చు..

విడుదల తేదీః 06/12/2019
రేటింగ్ః 2.75/5
నటీనటులుః కార్తికేయ, నేహా సోలంకి, రోల్ రైడ, రావు రమేష్, ప్రగతి, సత్య ప్రకాష్, అజయ్, రవికిషన్ తదితరులు.
సంగీతంః అనూప్ రూబెన్స్
నిర్మాతః అశోక్ రెడ్డి గుమ్మకొండ
దర్శకత్వంః యెర్ర శేఖర్ రెడ్డి

- Advertisement -