గ్రామాల డిజిటలీకరణకు హీరో ఆదిత్య ఓం చేయూత

285
Aditaya
- Advertisement -

సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే హీరో ఆదిత్య ఓం భద్రాచలం పరిధిలోని చెరుపల్లి, కొత్తపల్లి,కొత్తపల్లి, కోయనరసాపురం గ్రామాల డిజిటలీకరణకు శ్రీకారం చుట్టారు. పేస్‌ గ్రూప్‌కి చెందిన ‘టి.సేన’తో ఒప్పందం కుదుర్చుకొని గిరిజన గ్రామ యువతకు శిక్షణ ఇచ్చి ఈ ఆన్‌లైన్‌ కేంద్రాల ఏర్పాటుకు ఆర్థిక చేయూతనిస్తున్నారు. సినీ నిర్మాత, దర్శకులు విజయ్‌వర్మ పాకాలపాటి సహకారంతో కోయనరసాపురం గ్రామానికి చెందిన రామకృష్ణకి శిక్షణ ఇచ్చి సంక్రాంతి సందర్భంగా ఆ గ్రామంలో ‘టి.సేవ’ కేంద్రాన్ని ప్రారంభించారు.

hero aditya

మిగతా గ్రామాలలో అతి త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపారు. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా చెరుపల్లి పరిసర గ్రామాల వృద్ధులకు రగ్గులను, యువతకు క్రికెట్‌ కిట్‌లను అందించారు. అలాగే చెరుపల్లి స్కూల్‌కి కొన్ని బెంచీలను సమకూర్చుతున్నారు. ఈ కార్యక్రమాలను తన సన్నిహితుడు విజయ్‌వర్మ పాకాలపాటి చేతుమీదుగా చేయిస్తున్నట్టు వివరించారు హీరో ఆదిత్య ఓం.

- Advertisement -