మరో రెండు రోజులు భారీ వర్షాలు…

359
heavy rains

ఒడిశాలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోస్తా, తమిళనాడు పరిసరాల్లో 5.8 నుంచి 7.6 కి.మీ మధ్య ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీని ప్రభావంతో తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంపీ అప్రమత్తమైంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వినాయకచవితి మండపాల నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డైరక్టర్ వై.కె రెడ్డి ఆదివారం వెల్లడించారు.

అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో చెరువులకు జలకళ వచ్చింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో నిన్న కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతోంది. మూడడుగుల మేర ఎత్తులో రెండోసారి బయ్యారం చెరువు పొంగిపొర్లుతోంది. హైదరాబాద్‌లో రెండ్రోజులుగా భారీ వర్షం కురుస్తుండటంతో హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది.