జూరాలకు పోటెత్తుతున్న వరద…..శ్రీశైలంకు జలకళ

512
Jurala water
- Advertisement -

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, కృష్ణాబేసిన్లలో నీటి ప్రవాహాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఎగువ కర్ణాటక నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం జలకళ సంతరించుకుంది.

జూరాల జలాశయానికి 1.9 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వస్తుండగా.. 1.7 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి వదులుతున్నారు. జూరాల నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలకళ సంతరించుకుంటోంది.

జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.655 టీఎంసీలు కాగా..ప్రస్తుతం నీటినిల్వ 9 టీఎంసీలుగా ఉంది. జూరాల నుంచి శ్రీశైలానికి 1,76,284 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదిఇలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటో లింక్ విజయవంతమైంది. మేడిగడ్డ బరాజ్‌నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా ఎదురు ప్రయాణం ప్రారంభించిన ప్రాణహిత జలాలు…..అన్నారం, సుందిల్ల బరాజ్‌లను నింపుకొని, ఇప్పుడు సుందిల్ల పంప్‌హౌస్ ద్వారా ఎల్లంపల్లి జలాశయంలోకి చేరుకోవడంతో లింక్- 1 పరిపూర్ణమైంది.

- Advertisement -