ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం..43మంది మృతి

604
Delhi-fire
- Advertisement -

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రాణి ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండీలో ఈ తెల్లవారుజామున 5 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో మృతుల సంఖ్య 43కు చేరుకుంది.ఓ ఫ్యాక్టరీ లోపల కార్మికులు నిద్రిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 30 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాద ఘటనపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. అగ్నిప్రమాద ఘటన అత్యంత బాధాకరమన్నారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్న తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈఘటనపై రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ప్రధాని మోదీ కూడా స్పందించారు. మృతుల కటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డవారు కోలుకోవాలని కోరుకుంటున్నాని తెలిపారు.

- Advertisement -