తెలంగాణ…నిప్పుల కొలిమి

68
Heatwave In Telangana
ఎండల తీవ్రత నానాటికీ పెరిగిపోతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండటంతో బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు.

ఉదయం 9 గంటల నుండే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో మధ్యాహ్నం సమయానికి రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. ఆదివారం కొన్నిచోట్ల 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మే, జూన్‌ నెలల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.గతేడాది ఈశాన్య రుతుపవనాలు ఏ మాత్రం ప్రభావం చూపకపోవడంతో చెరువులు, కుంటలు ఎండిపోవడంతో పాటు గ్లోబల్‌ వార్మింగ్‌తో ఎండలు పెరుగుతున్నాయన్నారు.
ఎండలు, వడగాలుల తీవ్రత అధికంగా ఉండనుందన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.ఇక వడదెబ్బ బారినపడకుండా ప్రజలను రక్షించేందుకు ఇప్పటికే వేసవి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది ప్రభుత్వం.