ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి..స్పెషాలిటి బ్లాక్‌కు శంకుస్ధాపన

122
etela rajender

రోజురోజుకు విజృంభిస్తున్న క్యాన్సర్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని బలి తీసుకుంటోంది.  క్యాన్సర్ రోగం వచ్చింది అంటే లక్షల్లో ఖర్చు అవుతుందని భయపడే వాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అలాంటి  క్యాన్సర్ మహమ్మారి నుంచి లక్షలాది మందిని ఎంఎన్ జే ఆస్పత్రి కాపాడింది.

రోగులకు సేవలను మరింతగా విస్తచించడంలో భాగంగా ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి స్పెషాలిటీ బ్లాక్‌ను ప్రారంభించారు మంత్రి ఈటల రాజేందర్. ఈ సందర్భాంగా మాట్లాడిన ఈటల బోధనాస్పత్రుల్లో ప్రొఫెసర్ల వయో పరిమితి 58 నుంచి 65 కి పెంచినట్టు ప్రకటించారు.

కార్పోరేట్ ఆస్పత్రికి ధీటుగా వైద్యపరికరాలు ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ లో ఉన్నాయి. కేవలం క్యాన్సర్ కు వైద్యమే కాదు.. ఆ మహమ్మారి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అనే అంశంపైన ప్రజలకు నిరంతరం అవగాహన కల్పిస్తుంది.