జీహెచ్ఎంసీ ఉద్యోగులకు దీపావళి కానుక

360
Ghmc Mayor
- Advertisement -

దీపావళి పండుగ సందర్భంగా జీహెచ్ఎంసీ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది ప్రభుత్వం. జీహెచ్ ఎంసీలో పనిచేసే 5,156మంది శాశ్వత ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు వైద్య భీమా సౌకర్యాన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపారు. నవంబర్ 1వ తేది నుంచి ఈపథకం వర్తింపజేయనున్నట్లు తెలిపారు నగర మెయర్ బొంతు రామ్మెహన్.

ఈ మేరకు భీమా ప్రీమియం మొదటి విడత మొత్తాన్ని ఇన్సూరెన్సుఏజెన్సీ కి అందచేస్తునట్టు తెలిపారు. ఉద్యోగి, త‌న భ‌ర్త లేదా భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు, త‌ల్లిదండ్రులు మొత్తం ఆరుగురికి వైద్య బీమా ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌చేస్టున్నామని, న‌వంబ‌ర్ 1వ తేదీ నుండి అమ‌లులోకి వ‌చ్చే ఈ బీమా సౌక‌ర్యంలో భాగంగా క‌నీసం మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల విలువ‌గ‌ల వైద్య బీమాను వ‌ర్తింప‌చేస్తున్నామని తెలిపారు.

మరో మూడు లక్షల రూపాయల వరకు కూడా ఉపయోగించుకునె వెసులుబాటు కల్పించామని అన్నారు. అయితే జిహెచ్ఎంసిలో ఉన్న 5,156 మంది రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌oడరూ త‌మ కుటుంబ‌, ఉద్యోగ వివ‌రాల‌ను అంద‌జేయాల‌ని మెయర్ రామ్మోహన్ తెలియ‌జేశారు.

- Advertisement -