హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్న హరితహారం

72
Haritha Haram

తెలంగాణలో హరితహారం కార్యక్రమంకు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటుతున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా అరుదైన రికార్డు సృష్టించారు సింగరేణి డైరెక్టర్ ఎన్. బలరాం. కేవలం ఒక గంట వ్యవధిలోనే 1237 మొక్కలు నాటారు.

దీంతో హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ను సృష్టించారు. ఈసందర్భంగా నేడు శ్రీ‌రాంపూర్ ఉప‌రిత‌ల గ‌ని ఓబీ పై చేప‌ట్టిన మెగా హ‌రిత హారం కార్యక్రమం విజ‌య‌వంతం అయ్యింది. ఈ హరితహారం కార్యక్రమంలో జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి శ్రీ‌మ‌తి భార‌తి హోళ్ళికేరి, జిల్లా అట‌వీ శాఖ అధికారిణి శివాని డోంగ్రా, సీఐఎస్ఎఫ్ క‌మాండెంట్లు, సేవా, మ‌హిళా క్ల‌బ్‌స‌భ్యులు పాల్గోన్నారు.