హ‌రీష్ శంక‌ర్ ‘వాల్మీకి’లో తెలుగమ్మాయి

534
valmiki isha Rebba
- Advertisement -

ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ త్వ‌ర‌లో వాల్మీకి అనే సినిమాను చేయ‌నున్నాడు. త‌మిళంలో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న జిగ‌ర్తాండ మూవీకి ఇది రిమేక్. త‌మిళ్ లో బాబీసింహా , సిద్ధార్ద్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. తెలుగులో బాబీసింహా పాత్ర‌లో మెగా హీరో వ‌రుణ్ తేజ్ న‌టించ‌గా సిద్ధార్ద్ పాత్ర‌లో శ్రీవిష్ణు న‌టించ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించ‌నున్నాడు. ఇటివ‌లే ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని తెలుస్తుంది.

valmiki

ప్ర‌స్తుతం హీరోయిన్ల‌ను వెతికే ప‌నిలో ఉన్నాడు ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్. ఇన్ని రోజులు ర‌ష్మీక మంద‌న పేరు వినిపించ‌గా తాజాగా ఈషా రెబ్బ పేరు వినిపిస్తుంది. ఇటివ‌లే ఆమె చేసిన బ్రాండ్ బాబు, సుప్ర‌హ్మ‌ణ్య‌పురం సినిమాలు అంత‌గా ఆడ‌లేదు. మొత్తానికి ఈఇద్ద‌రి పేరు మాత్రం గ‌ట్టిగా వినిపిస్తుంది. వీరిద్ద‌రిలో ఎవ‌రిని ఫైన‌ల్ చేస్తారో చూడాలి మ‌రి. రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నారు.

- Advertisement -