జగన్‌కు హరీష్‌ విషెస్‌..స్వీట్ తినిపించిన భారతి

307

ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే 48కి పైగా స్ధానాల్లో విజయకేతనం ఎగురవేసిన వైసీపీ మరో 102 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయం అయిపోయింది. ఈనేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఏపీలో వైఎస్సార్సీపీ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్‌. ట్విట్టర్ ద్వారా వైఎస్ జగన్‌కు అభినందనలు తెలిపారు. చారిత్రాక విజయం సాధించిన జగన్‌కు శుభకాంక్షలు మీ కష్టానికి ఫలితం దక్కింది. ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారని ట్వీట్ చేశారు. ఏపీ కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న మీకు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.

ఇక జగన్‌కు స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపింది భారతి. జగన్ గెలుపు ప్రజల గెలుపని ఈ సందర్భంగా ఆమె అన్నారు. మరోవైపు జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ,సీఎం కేసీఆర్,కేటీఆర్ విషెస్ చెప్పారు. సొదర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పాలనను సమర్థంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

harish