ఐక్యతతో గ్రామాల అభివృద్ధి: హరీష్ రావు

388
harish rao
- Advertisement -

గ్రామం అభివృద్ధి కావాలంటే.. గ్రామస్తులంతా ఐక్యతతో ముందుకు రావాలని మాజీ మంత్రి హరీష్‌ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన హరీష్‌ గ్రామస్తులందరు ఒకే మాట.. ఒకే బాటగా కలిసి మెలసి ఉండాలని పిలుపునిచ్చారు.

రూ.16లక్షల వ్యయంతో నిర్మించిన కొత్త గ్రామ పంచాయతీ భవనం, రూ.15లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సమాఖ్య సంఘ భవనాలు ప్రారంభించడంతో పాటు రూ.38లక్షల వ్యయంతో నిర్మించనున్న ఐకేపీ-వడ్ల, మక్కల కొనుగోలు కేంద్ర సీసీ ప్లాట్ ఫామ్, రూ.18లక్షల వ్యయంతో నిర్మించనున్న స్మశాన వాటిక, డంప్ యార్డు, కోటి 80లక్షలతో 20 సామూహిక గొర్రెల షెడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు.

అదే విధంగా గ్రామంలోని శ్రీ మాడేలయ్య దేవాలయ నిర్మాణం, వివిధ గ్రామ అభివృద్ధి కార్యక్రమాలలో . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో హరీశ్ రావు గారు మాట్లాడుతూ.. పుల్లూరు గ్రామంలో ఇప్పటి వరకు రూ.8కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసుకున్నామని, గ్రామస్తులంతా ఐక్యతతో ఉంటే.. ఇబ్రహీంపూర్ గ్రామం తరహాలో పుల్లూరు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం సులువుగా ఉంటుందని గ్రామస్తులకు వివరించారు.

రానున్న వర్షాకాలం దృష్ట్యా సిద్ధిపేట నియోజకవర్గం పరిధిలోని అన్నీ గ్రామాలలో పారిశుద్ధ్యం పై స్పెషల్ డ్రైవ్ నిర్వహణ చేపట్టేలా.. త్వరలోనే గ్రామ పంచాయతీ, ఎంపీడీఓ, డీపీఓలతో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ముందుస్తు జాగ్రత్త చర్యలు చేపట్టేలా.. మండలాలు, గ్రామాల వారీగా గ్రామస్తులను భాగస్వామ్యం చేస్తూ పారిశుద్ధ్యం పై స్పెషల్ డ్రైవ్ చేపడుదామని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రూరల్ మండలం మొదట పుల్లూరు గ్రామానికి గోదావరి నీళ్లు వస్తున్నాయని తెలిపారు. గ్రామస్తుల కోరిక మేరకు సర్పంచ్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కావాలని కోరగా.., మొదటి ప్రాధాన్యతను ఇచ్చి డబుల్ బెడ్ ఇళ్లు మంజూరు చేస్తానని భరోసా ఇచ్చారు. అందరూ గ్రామ అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని , గ్రామం పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇందుకు ప్రతి ఒక్కరు పారిశుద్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు..మొక్కలు నాటాలి…వాటిని సంరక్షించు కోవాలని చెప్పారు.. గ్రామాన్ని పరిశుభ్ర… ఆకుపచ్చ… అభివృద్ధిలో ఆదర్శంగా పుల్లూరు గ్రామాన్ని తీర్చిదిద్దుకుందామని తెలియజేశారు..

పుల్లూరు గ్రామంలో ఏళ్ల నుంచి రెవెన్యూ సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం దిశగా సిద్ధిపేట ఆర్డీఓ జయచంద్రా రెడ్డి, తహశీల్దారు వారం రోజుల్లో ఒక రోజు గ్రామానికే వచ్చి భూ రెవెన్యూ సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఆర్డీఓ, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పట్టాదారు పాసు పుస్తకం అందించడంతో పాటు, రైతుబంధు పథకం కింద వచ్చే పెట్టుబడి సాయం అందిస్తానని వెల్లడించారు.

- Advertisement -