పేదలకు అండగా సీఎం సహాయ నిధి:హరీష్‌ రావు

171
harish rao

నిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి ఉందన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేటలో 56 మందికి ₹17,22 లక్షల సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన హరీష్‌ నియోజకవర్గంలో 56మంది ₹17, 22 లక్షలు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరు అయినట్లు తెలిపారు.

వివిధ కారణాలతో అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు అండగా…సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందన్నారు. సిద్దిపేట పట్టణం 25 మందికి ₹7,92 500 , సిద్దిపేట రూరల్ లో నలుగురికి ₹1,03,000 ,సిద్దిపేట అర్భన్ ఇద్దరికి ₹97,000 చిన్నకోడూర్ 16మందికి ₹4,44,000 , నంగునూర్ మండలంలో 7గురు ₹1,99,500 , నారాయణ రావు పేట మండలంలో ఇద్దరికి 86వేలు రూపాయలు చెక్కుల పంపిణీ చేశారు.