రానా బర్త్ డే…విరాటపర్వం స్పెషల్ విషెస్

505
virataparvam
- Advertisement -

సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తు….టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా ఎదుగుతున్న హీరో రానా. తన మొదటి సినిమాతోనే లీడర్ అనిపించుకున్న రానా. ప్రతి ఒక్కరిలో సామాజిక స్పృహ ఉండాలనే అభ్యుదయ దృక్పథంతో తీసిన సినిమానే లీడర్. నాయకుడనే వాడు సామాన్యుడిని చైతన్యపరచాలనే కేరక్టర్ లో రానా ఫస్ట్ మార్కులు కొట్టేశాడు. తర్వాత వచ్చిన కృష్ణం వందే జగద్గురుంతో మాస్‌తో పాటు క్లాస్ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ఇక బాహుబలి చిత్రంతో ఇంటర్నేషనల్ ఫేం తెచ్చుకున్న రానా పుట్టినరోజు నేడు. రానా బర్త్ డే సందర్భంగా greattelangaana.com శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

సౌత్తో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రానా. హీరోగా, ప్రతినాయకుడిగా రానా పోషించిన పాత్రలకు అశేష ఆదరణ దక్కింది.కెరీర్ స్టార్టింగ్ నుంచే బాలీవుడ్ సినిమా మీద దృష్టి పెట్టిన రానా… అమితాబ్ లాంటి టాప్ స్టార్స్తో కలిసి నటించాడు. బాహుబలి సినిమా తర్వాత బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు అక్కడి సినీ ప్రముఖులకూ సుపరిచితుడిగా మారిపొయాడు భల్లాలదేవుడు.రానా కేవలం యాక్టర్ మాత్రమే కాదు ..నిర్మాత కూడా. బొమ్మలాట .. ఎ బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ పేరుతో ఓ సినిమా తీయగా దానికి అవార్డులు కూడా వచ్చాయి. రానాకు విజన్ ఉంది. అందుకే విజువల్ ఎఫెక్ట్స్ కో ఆర్డినేటర్ గా కూడా చేస్తున్నాడు.

ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న రానా తెలుగులో విరాట‌ప‌ర్వం అనే సినిమా చేస్తున్నాడు. వేణు ఊడుగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా రానా సరసన సాయిప‌ల్ల‌వి క‌థానాయిక‌గా నటిస్తోంది. 1990 నాటి రాజకీయ అంశల నేపథ్యంగా ఈ మూవీ తెరకెక్కుతుండగా నక్సలైట్ గా, ఆ తర్వాత పొలిటికల్ లీడర్‌గా కనిపించనున్నారు రానా. ఇక రానా బర్త్ డే సందర్భంగా పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు.

- Advertisement -