హ్యాపీ బర్త్ డే టు … నాని

208
Happy Birthday to Nani
- Advertisement -

మెగా ఫోన్ పట్టాలనుకున్న నాని మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చాడు… ‘అష్టాచెమ్మా’తోనే జనానికి నచ్చాడు… ఆ పైన ‘రైడ్’ చేసుకుంటూ ‘భీమిలి కబడ్డీ జట్టు’ను నడిపాడు… ‘అలా మొదలయింది’తో కెరీర్‌కు మంచి పునాది వేసుకున్నాడు. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని చూపిస్తు ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరో  నాని పుట్టినరోజు నేడు.

Happy Birthday to Naniవెండితెరకి కథానాయకుడిగా పరిచయం కావడం … అశేష ప్రేక్షకులను మెప్పించి నిలదొక్కుకోవడం అంత తేలికైన విషయం కాదు. సినిమా నేపథ్యం లేకపోయినా … గాడ్ ఫాదర్స్ గైడెన్స్ లేకపోయినా ఇక్కడకి రావడం … రాణించడం ఓ సాహసమే అవుతుంది. అలాంటి సాహసం చేసి సక్సెస్ అయిన వారిలో చిరంజీవి … శ్రీకాంత్ … రవితేజా తరువాత కనిపించే పేరు నాని.హైదరాబాదులో పుట్టి పెరిగిన నాని తనకి అందుబాటులో ఉన్న చిత్ర పరిశ్రమ పట్ల ఇష్టాన్ని పెంచుకున్నాడు. మనసులో హీరో కావాలనే ఆలోచన ఉన్నప్పటికీ, ముందుగా అధ్యయనం … అవగాహన అవసరమని భావించి డైరెక్షన్ విభాగంలో చేరాడు. క్లాప్ బోర్డ్ పట్టుకుని లొకేషన్లో హడావిడిగా తిరుగుతూనే, వివిధ సన్నివేశాల్లో నటీనటుల నటన … వారిలోని ప్రత్యేకతలను దగ్గరనుంచి పరిశీలించాడు.

Happy Birthday to Nani

అవకాశం రాగానే ‘అష్టా చెమ్మా’ ఆడినంత తేలికగా నటించేశాడు. నాని కెరీర్ ను పెద్ద మలుపు తిప్పింది ‘పిల్ల జమీందార్’. ఈ సినిమాను యువత విశేషంగా ఆదరించింది. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటించిన ‘ఈగ’ అపూర్వ విజయం సాధించింది. సక్సెస్ రూటులో సాగుతున్న నాని రాజమౌళి సినిమాతో విజయం చూసిన హీరోలకు తరువాత పరాజయాలే పలకరిస్తాయనే సెంటిమెంట్ నాని విషయంలోనూ పనిచేసింది.

ఈగ తర్వాత వరుస ప్లాప్‌లతో సతమతమైన తన కాన్ఫిడెంట్‌ కొల్పోకుండా మళ్లీ సక్సెస్ బాటపట్టాడు నాని.భలే భలేమగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాధ, జెంటిల్ మాన్‌, మజ్ను, నేను లోకల్‌తో వరుస విజయాలను సొంతం చేసుకున్నాడు. నేను లోకల్ తర్వాత నాని చేస్తున్న సినిమా నిన్నుకోరి.

Happy Birthday to Nani

కెరియరులో చకచకా పైమెట్లు ఎక్కేసిన నాని కి ఇప్పుడు యూత్ లో విపరీతమైన క్రేజ్. కలలను నిజం చేసుకోవాలంటే కష్టపడాలని మరోసారి నిరూపించిన నాని, తన తరువాత వారికి ఓ స్ఫూర్తిగా నిలిచాడని చెప్పొచ్చు. మళ్ళీ సక్సెస్ ట్రాక్ లో సాగిపోతున్న నాని ఇకపై ఇలాగే జనాన్ని అలరించే చిత్రాల్లో నటిస్తూ ఉండాలని ఆశిస్తు గ్రేట్ తెలంగాణ. కామ్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

- Advertisement -