నేచురల్ స్టార్ నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు..!

1197
hero nani
- Advertisement -

‘అష్టాచమ్మా’తోనే జనానికి నచ్చాడు… ఆ పైన ‘రైడ్’ చేసుకుంటూ ‘భీమిలి కబడ్డీ జట్టు’ను నడిపాడు… ‘అలా మొదలయింది’తో కెరీర్‌కు మంచి పునాది వేసుకున్నాడు. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని చూపిస్తు నేచురల్ స్టార్ గా ఎదిగిన నాని పుట్టినరోజు నేడు.

వెండితెరకి కథానాయకుడిగా పరిచయం కావడం… అశేష ప్రేక్షకులను మెప్పించి నిలదొక్కుకోవడం అంత తేలికైన విషయం కాదు.ఎలాంటి సినిమా నేపథ్యం లేకపోయినా… గాడ్ ఫాదర్స్ లేకుండా ఇండస్ట్రీకి రావడం… రాణించడం ఓ సాహసమే అవుతుంది. అలాంటి సాహసం చేసి సక్సెస్ అయిన వారిలో చిరంజీవి… శ్రీకాంత్… రవితేజా తరువాత కనిపించే పేరు నాని.

హైదరాబాదులో పుట్టి పెరిగిన నాని  మనసులో హీరో కావాలనే ఆలోచన ఉన్నప్పటికీ, ముందుగా అధ్యయనం … అవగాహన అవసరమని భావించి డైరెక్షన్ విభాగంలో చేరాడు. క్లాప్ బోర్డ్ పట్టుకుని లొకేషన్లో హడావిడిగా తిరుగుతూనే, వివిధ సన్నివేశాల్లో నటీనటుల నటన … వారిలోని ప్రత్యేకతలను దగ్గరనుంచి పరిశీలించాడు.

nani birthday

అవకాశం రాగానే ‘అష్టా చెమ్మా’ ఆడినంత తేలికగా నటించేశాడు. నాని కెరీర్ ను పెద్ద మలుపు తిప్పింది ‘పిల్ల జమీందార్’. ఈ సినిమాను యువత విశేషంగా ఆదరించింది. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటించిన ‘ఈగ’ అపూర్వ విజయం సాధించింది. సక్సెస్ రూటులో సాగుతున్న నాని రాజమౌళి సినిమాతో విజయం చూసిన హీరోలకు తరువాత పరాజయాలే పలకరిస్తాయనే సెంటిమెంట్ నాని విషయంలోనూ పనిచేసింది.

ఈగ తర్వాత వరుస ప్లాప్‌లతో సతమతమైన తన కాన్ఫిడెంట్‌ కొల్పోకుండా మళ్లీ సక్సెస్ బాటపట్టాడు నాని.భలే భలేమగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాధ, జెంటిల్ మాన్‌, మజ్ను, నేను లోకల్‌,ఎంసీఏ సినిమాలతో డబుల్ హ్యాట్రిక్‌ విజయాలను సొంతం చేసుకున్నాడు. అ! సినిమాతో నిర్మాతగా మెప్పించాడు.

నాగ్ తో దేవదాస్ వంటి మల్టీస్టారర్ హిట్ కొట్టాడు. అంతేకాదు జెర్సీ సినిమాతో మరోసారి తన సహజమైన నటనతో ఆకట్టుకున్న నాని గ్యాంగ్ లీడర్ గా ఎదిగాడు. ప్రస్తుతం ‘V’మూవీతో వస్తున్న నాని తన కెరీర్ లో మరిన్ని విజయాలను సాధించాలని ఆశిస్తూ గ్రేట్ తెలంగాణ. కామ్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

- Advertisement -