కోమటిరెడ్డి….కల్లు తాగిన కోతి: గుత్తా

446
gutha sukhender reddy

కోమటిరెడ్డి కల్లు తాగిన కోతి అని మండిపడ్డారు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి. తప్పతాగి పూటకో మాట మాట్లాడే కోమటిరెడ్డి మాటలపై స్పందించాలంటే అసహ్యంగా ఉందన్నారు. నల్గొండలో తన నివాసంలో మీడియాతో మాట్లాడిన గుత్తా.. రాజకీయాల్లో హుందాతనం, విజ్ఞత అవసరం అని కానీ కోమటిరెడ్డికి అవి రెండు తెలియవన్నారు.

బ్రాహ్మణ వెళ్ళెంల ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని యుద్దప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని చెప్పారు.బ్రాహ్మణ వెళ్ళెంల ప్రాజెక్టు లో కమిషన్ లు పొందిన నీచ చరిత్ర కోమటిరెడ్డిదని మండిపడ్డారు.సంవత్సరం లో బ్రహ్మాణ వెళ్ళాంల ప్రాజెక్ట్ ను పూర్తి చేసి నీరందిస్తామన్నారు.

బీజేపీ నేతలకు తెలంగాణ అభివృద్దిపై కనీ సోయి లేదన్నారు. తెలంగాణకు రావాల్సిన యురియాను తెప్పించాల్సిన కనీస బాధ్యతను మరిచి ఢిల్లీలో కూర్చొని రాజకీయాలు చేస్తూ తెలంగాణ లో అభివృద్ధి ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.బీజేపీ లక్ష్మణ్ టీఆర్ఎస్ పార్టీ ఖతం అవుతుంది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు….సీఎం కేసీఆర్ ముందు బీజేపీ పప్పులు ఉడకవన్నారు.యూరియా కొరత కు కారణం కేంద్ర ప్రభుత్వనీదే….పది రోజుల్లో యూరియా కొరత లేకుండా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.