‘గుణ 369’ ట్రైల‌ర్ వచ్చేసింది..!

117
guna 369

`ఆర్.ఎక్స్.100` ఫేమ్ కార్తికేయ న‌టిస్తున్న తాజా చిత్రం `గుణ 369` ఈ మూవీలో అన‌ఘ హీరోయిన్‌గా నటిస్తోంది. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాల ఈ చిత్రంతో దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

ఇందులో ల‌వ్‌, యాక్ష‌న్, ఎమోష‌న్స్ సీన్స్ సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. మ‌నిషి రూపం వేరు..నిజస్వ‌రూపం వేరు అని కార్తికేయ చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంటుంది. ఈ చిత్రానికి చింత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేస్తున్నారు. ర‌స్టిక్ ల‌వ్ స్టోరీగా ఉండ‌నున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని చెబుతున్నారు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్, బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శీను చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు.