ఎట్టకేలకు బోణి కొట్టిన తెలుగు టైటాన్స్

237
telugu titans

ప్రొ కబడ్డీ లీగ్ సీజన్‌ 7లో వరుస ఓటములతో ఫ్యాన్స్‌ నిరాశ పర్చిన తెలుగు టైటాన్స్‌ ఎట్టకేలకు బోణి కొట్టింది. గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమిష్టి కృషితో విజయం సాధించింది. ఫస్టాప్‌లో సిద్ధార్థ్‌ రైడింగ్‌లో చెలరేగితే సెకండాఫ్‌లో విశాల్‌ భరద్వాజ్‌ తన పట్టుతో ప్రత్యర్థి రైడర్లను పట్టేశాడు. దీంతో గుజరాత్‌ సొంత మైదానంలో వరుసగా రెండో ఓటమిని చవిచూసింది.

రైడింగ్‌లో గుజరాత్‌ పైచేయి సాధించినా టైటాన్స్‌ డిఫెన్స్‌లో దూమ్మురేపింది. ఐదు పరాజయాలు, ఓ టై తర్వాత తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. మారిన జెర్సీ రంగు తెలుగు టైటాన్స్‌ జట్టుకు అదృష్టాన్ని తీసుకొచ్చింది.దీంతో 30-24తేడాతో బెంగళూరును ఓడించింది.

అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 30–33తో హరియాణా స్టీలర్స్‌ చేతిలో ఓడింది. ఇక ఇవాళ జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్‌ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్‌, యూపీ యోధతో బెంగళూరు బుల్స్‌ తలపడనున్నాయి.