గద్వాలలో సింగిరెడ్డి.. సూర్యపేటలో జగదీష్ రెడ్డి..

108
TRS

ఇవాళ జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఆయనతో పాటు గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,అలంపూర్ శాసనసభ్యులు వీ ఎమ్‌ అబ్రహం,ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ బండరీ భాస్కర్‌ పాల్గొన్నారు. పూజ కార్యక్రమం అనంతరం మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మొక్కలు నాటారు.. ఇంకా కార్యక్రమంలో జోగులంబ గద్వాల జిల్లా నూతన జడ్పీ ఛైర్మన్ సరితా తిరుపతయ్య, తెలంగాణ కన్స్యూమర్ ఫోరమ్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, తెరాస పార్టీ సీనియర్ నాయకులు నాగర్దొడ్డి వెంకట్రములు, జిల్లా గ్రంధాలయా చైర్మన్ బీ ఎస్‌ కేశవ్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

singi reddy

అలాగే సూర్యాపేట జిల్లాలోని ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర నూతన ఎస్పీ ఆఫీసు పక్కన టిఆర్ఎస్ పార్టీ భవన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తోపాటు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్,ఎమ్మెల్యే గాధరి కిషోర్, జడ్పీ చైర్మన్ దీపిక యుగేందర్ రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,మున్సిపాలిటీ చైర్మన్ గుండూరి ప్రవల్లిక ప్రకాష్,జడ్పీటీసీలు, ఎంపిటిసిలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

jagadeesh reddy

పార్టీ నూతన ఆఫిసుల ప్రారంభోత్సంలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నూతన భవన శంకుస్థాపన కార్యక్రమంలో నల్గొండ జిల్లా జడ్పీ ఛైర్మన్ బండా నరేంద్రర్ భూమి పూజ చేశారు, ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి,రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి,బ్రాహ్మణ పరిషత్ సభ్యులు చకిలం అనిల్ కుమార్,ఎమ్మెల్సీ తెరా చిన్నపరెడ్డి,నకిరేకల్, మిర్యాలగూడ ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యేఎమ్మెల్సీలు మరియు జడ్పీటీసీలు, ఎంపీపీలు,ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు,రాష్ట్ర జిల్లా,మండల,గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

banda narender

ఇక మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం నిర్మాణానికి జిల్లా పరిషత్ చైర్మన్ బిందు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, డీఎస్ రెడ్యానాయక్ లు హాజరైయ్యారు.

bindhu