గ్రీన్‌ ఛాలెంజ్‌..నవ భారతానికి నాంది

474
green challenge
- Advertisement -

వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది… ఒక్క ఆలోచన లక్ష మెదళ్లలో కదలిక తీసుకొచ్చింది. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ మనసులో పురుడు పోసుకున్న ఆ ఆలోచన నిజంగానే ఎన్నో మెదళ్లలో కదలిక తీసుకొచ్చింది. ఆ ఆలోచనకు రూపమే.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌. ఎందరినో కదిలించింది ఈ కార్యక్రమం.

జీవితం మంటే వందసంవత్సరాల కాలం కాదు,వేల సంవత్సరాల జ్ఞాపకం..జ్ఞాపకం అంటే గతాన్ని గుర్తు పెట్టు కోవటం కాదు..ప్రపంచానికి మనం గుర్తుండేల చేయడం..సంతన్న మనసులో పుట్టిన ఈ ఆలోచన ఇప్పుడు ఉద్యమంలా సాగుతోంది.ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అనతికాలంలోనే లక్షల మందిని కదలించింది.

2018 జూలైలో మూడు మొక్కలు నాటిన సంతోష్‌ కుమార్‌..మరో ముగ్గురికి మొక్కలు నాటాలనే ఛాలెంజ్‌ని విసిరారు. అదే ఇప్పుడు కోట్ల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమమైంది. సినీ, క్రీడా, రాజకీయ, సామాజిక, కుల, మతాలకు అతీతంగా అందరు గ్రీన్‌ ఛాలెంజ్‌ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలు నాటడమే కాదు మరో ముగ్గురికి మొక్కలు నాటాలని సూచిస్తున్నారు. ఎంపీ సంతోష్ మొదలు పెట్టిన చిన్న ప్రయత్నం విశ్వవ్యాప్తం అయి నవ భారతానికి నాంది అయి…పర్యావరణ పరిరక్షణపై అందరికి అవగాహన కలిగిస్తోంది.

- Advertisement -