హరిత కట్టడాలు నిర్మిద్దాం: ట్రెడా చలపతి రావు

399
green challenge
- Advertisement -

ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి మూడు మొక్కలు నాటారు ట్రెడా ప్రెసిడెంట్ చలపతి రావు. ఈ సందర్భంగా చలపతి రావు మాట్లాడుతూ హరిత భవనాల నిర్మాణంలో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచించి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా తెలంగాణను మొదటి స్థానంలో నిలబెట్టడానికి ఎంతో దోహదపడుతుంది అన్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి పరిసరాలను మొక్కలతో ఉంచినట్లయితే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్నారు .

మన భవనాలన్నీ పాత రోజుల్లో ఎక్కువగా పర్యావరణహితంగా ఉండేవి. సహజసిద్ధంగా గాలి వెలుతురు వచ్చేలా ఇళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, కార్యాలయాల నిర్మాణాలు చేపట్టే వారు నిర్వహణ వ్యయం పరిమితంగా ఉండేది. పట్టణీకరణ, భూముల ధలు పెరగడంతో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ నిర్మాణాలు చేపట్టడం మొదలైనప్పటికీ గాలి వెలుతురు కోసం విద్యుత్తుపై ఆధారపడడం మొదలైంది. పగలు సైతం విద్యుత్తు వినియోగంతో విడుదలవుతున్న కాలుష్య ఉద్గారాలు పర్యావరణానికి తీవ్ర హాని చేస్తున్నాయి. కొత్త భవనాల నిర్మాణం పర్యావరణంపై తీవ్ర ప్రబావం ఉంటుందన్నారు.

భవనాల కోసం పచ్చదనంపై వేటు పడుతోంది. దీంతో ఈ భవనాల్లో నివసిస్తున్న వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి దశలో హరిత భవనాల ప్రాధాన్యత పెరిగింది. కొనుగోలుదారులు సైతం వీటివైపు మొగ్గు చూపుతుండడంతో నిర్మాణదారులు హరిత నిర్మాణ ప్రాజెక్ట్ లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వ భవనాలు సైతం పర్యావరణహితంగా కడుతున్నారు. ప్రాజెక్ట్ డిజైన్ దశ నుంచే పర్యావరణహితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ తరహా చేపట్టే ప్రాజెక్ట్కు అంతర్జాతీయంగా, దేశీయంగా వేర్వేరు సంస్థలు రేటింగ్ ఇస్తున్నాయి. ఏటా రేటింగ్ పొందుతున్న ప్రాజెక్ట్ల సంఖ్య పెరుగుతుండడం విశేషం.ఈ సందర్భంగా మరో ముగ్గురికి సునిల్ చంద్రారెడ్డి, ఎం. విజయ్ సాయి, ఎం. శ్రీధర్ రావులకు గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చారు.

- Advertisement -