టీఆర్ఎస్ లోకి గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు?

239
anjan kumar yadav
- Advertisement -

లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే వరుస ఓటమితో కుంగిపోతున్న ఆ పార్టీని వలసలు మరింత దెబ్బతీస్తున్నాయి. కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్ లు ఇప్పటికే తాము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ కీలక నేత మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఇదే బాటలో నడువనుందని తెలుస్తుంది. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ కవిత తో చర్చలు కూడా జరిపారని తెలుస్తుంది. సబిత చేరికకు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో ఆయనకు చేవెళ్ల ఎంపీ టికెట్ కన్ఫామ్ అయింది.

దింతో చేవెళ్ల పార్లమెంట్ స్ధానం నుంచి పోటీ చేద్దామనుకున్న సబిత కుమారుడు కార్తిక్ రెడ్డికి టికెట్ లభించకపోవడంతో నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది. సబిత టీఆర్ఎస్ లోకి వస్తే ఆమెకు మంత్రి పదవి కుమారుడికి ఎంపీ లేదా ఎమ్మెల్సీ పదవి హామి ఇచ్చినట్టు తెలుస్తుంది. త్వరలోనే సబితా గులాబీ కండువా కప్పుకునేందుకు రెడీగా ఉందని సమాచారం. ఇక తాజాగా మరో కీలక నేత పార్టీని విడనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మాజీ ఎంపీ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారట. పలువురు నేతలతో ఆయన మంతనాలు జరుపుతున్నారని తెలుస్తుంది. టీఆర్ఎస్ తరపున ఆయన సికింద్రబాద్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. ఇందులో వాస్తవమెంతో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

- Advertisement -