ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లు ఖరారు..

495
kcr cm
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభంకానున్నాయి. నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్, విప్ లను ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సాయంత్రం ఖరారు చేశారు.ప్రభుత్వ చీఫ్ విప్‌గా దాస్యం వినయ భాస్కర్, విప్ లుగా గొంగిడి సునిత, గంప గోవర్థన్, గువ్వల బాలరాజు, అరికెపూడి గాంధి, రేగ కాంతారావు, బాల్క సుమన్ లను ముఖ్యమంత్రి నియమించారు.

9వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. 9 వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్, మండలిలో ఆయన తరపు వేరొక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్ సమావేశాల్లో ఆరునెలల కాలానికి ఓటాన్ ఎక్కౌంట్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టనున్నారు. సెప్టెంబర్ 13 వరకు ఈ సమావేశాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -