గోపిచంద్ “చాణక్య” ట్రైలర్ విడుదల

377
gopichand
- Advertisement -

మాచో హీరో గోపిచంద్ గత కొద్ది రోజులుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. గోపిచంద్ త్వరలో చాణక్య మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తమిళ దర్శకుడు తిరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గోపిచంద్ సరసన మెహ‌్రీన్ నటిస్తోంది. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర చాణక్య సినిమాను నిర్మిస్తున్నాడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈమూవీ ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ ట్రైలర్ లో విజువల్స్ అదిరిపోయాయి. దీన్ని బట్టీ హై టెక్నికల్ వ్యాలూస్ తో ఈ సినిమాని రూపొందించినట్లు తెలుస్తోంది. ‘చావుకు తెగించినోడు బుల్లెట్ కు బయపడడు ఖురూషీ’ అంటూ గోపిచంద్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.

- Advertisement -