గోపిచంద్‌..చాణక్య ఫస్ట్ లుక్

204
chanakya firstlook

గోపిచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం చాణక్య. వైవిధ్యభరితమైన కథ,కథనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీలో గోపిచంద్ సరసన మెహ్రీన్ కథానాయికగా నటిస్తోండగా జరీన్‌ ఖాన్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.

గోపిచంద్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంటోంది. ప్రతీకారం తీర్చుకోవడం కోసం రంగంలోకి దిగిన కథానాయకుడు, ఆ పనిలో నిమగ్నమైనట్టుగా గోపీచంద్ అదిరిపోయే లుక్‌లో దర్శనమిచ్చాడు. అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇండియా, పాకిస్థాన్ బోర్డర్‌లో గల జైసల్మేర్ పరిసర ప్రాంతాల్లో జరిగింది.

కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బందిపడుతున్న గోపిచంద్ ఇప్ప‌టి వ‌ర‌కు 25 చిత్రాల‌లో న‌టించాడు. ఈ సినిమాతో తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో ఉన్నాడు. మరి గోపిచంద్‌ నమ్మకాన్ని చాణక్య నిలబెడుతుందో లేదో చూడాలి.