బోయపాటితో గోపీచంద్‌ కొత్త చిత్రం ప్రారంభం..!

512
gopichand
- Advertisement -

టాలీవుడ్‌లో యాక్షన్ హీరోగా గోపీచంద్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన ‘చాణక్య’ ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే గోపీచంద్ తన తదుపరి చిత్రాన్ని సెట్స్ పైకి తెచ్చేశాడు.

Gopichand

తాజాగా ఈ చిత్ర పూజా కార్య‌క్ర‌మాలు ఘ‌నంగా జ‌రిగాయి. బోయ‌పాటి శీను క్లాప్ కొట్టారు. ప్రారంభ కార్య‌క్ర‌మానికి చిత్ర‌బృందంతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.మ‌రి కొద్ది రోజుల‌లో సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ చిత్రాన్ని సంప‌త్ నంది తెర‌కెక్కించ‌నున్నారు. త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టించ‌నుంది.

GOPICHAND new movie openin

ఈ చిత్రాన్ని సిల్వ‌ర్ స్క్రీన్ ప‌తాకంపై నిర్మిస్తున్నారు. సంప‌త్ నంది- గోపి చంద్ కాంబినేష‌న్‌లో గౌతమ్ నందా అనే చిత్రం తెర‌కెక్కగా, ఈ చిత్రం 2017లో విడుద‌లై మిక్స్‌డ్ టాక్ పొందింది. మరి ఈ చిత్రం ఏ రేంజ్ హిట్ కొడుతుందో వేచిచూడాలి.

- Advertisement -