జగపతి బాబు @ 30 ఇయర్స్

211
jagapathi babu
- Advertisement -

అడవి శేష్ హీరోగా వచ్చిన స్పై థ్రిల్లర్ ‘ గూఢచారి’.. శిభిత ధూళిపాళ హీరోయిన్.. అలనాటి హీరోయిన్ సుప్రియ ఈ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది.. టీజర్ , ట్రైలర్ లతో మంచి ఇంప్రెషన్ తెచ్చుకున్న ఈ సినిమా విడుదలైన తొలి రోజునుంచే మంచి వసూళ్లను రాబట్టుకుని సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.. కాగా ఈ చిత్రానికి సంబంధించిన థాంక్స్ మీట్ ఇటీవలే హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి జగపతి బాబు ముఖ్య అతిధిగా హాజరు కాగా అయన సినిమా ఇండస్ట్రీ కి వచ్చి 30 సంవత్సరాలయ్యింది.. ఈ సందర్భంగా ఆ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

jagabapathi babu 30 years

ఈ సందర్భంగా నటుడు జగపతి బాబు మాట్లాడుతూ… గూఢచారి సినిమా నాకెంతో స్పెషల్ ఎందుకంటే నా 30 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది గూఢచారి తోనే.. ఇంతకంటే ఎం కావలి నాకు.. ఒక్క సినిమా చేస్తే చాలు అనుకున్న నాకు 30 ఏళ్ళు సినిమాలు చేసే అవకాశం కల్పించారు.. అందరికి నా స్పెషల్ థాంక్స్ అన్నారు.. చిరంజీవి గారి క్లాప్ తో మొదలైన నా ప్రయాణం ఇక్కడిదాకా వచ్చింది.. అందరి లాగ నేను కూడా ఓ స్టార్ అవబోతున్నానని అప్పుడు అనిపించింది. కానీ వరుసగా 10 ఫ్లాప్ ల తర్వాత కూడా నన్ను ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్ అన్నారు.. ఇక ఈ గూఢచారి థాంక్స్ మీట్ ఫంక్షన్ ని నా కోసం చేసారంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.. సినిమా గురించి చెప్పాలంటే టీం అంతా చాల బాగా చేసారు..ఏ ఫెసిలిటీ లేకుండా ఈ సినిమాకి అందరు టెక్నిషియన్స్ చాల బాగా పనిచేశారు. నా 30 ఇయర్స్ ని ఇంత బాగా సెలెబ్రేట్ చేసినందుకు అందరికి నా ధన్యవాదాలు అన్నారు.

హీరో అడివి శేష్ మాట్లాడుతూ “ఈ సినిమా నిర్మాతలకి చాలా థాంక్స్ . మమ్మలిని నమ్మినా అభిషేక్ నామా గారికి థాంక్స్. అలాగే మా గూఢచారి ద్వారా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జగపతి బాబు గారికి స్పెషల్ థాంక్స్. ఒక అద్భుతమైన నటుడు. మేము రాసుకున్న రోల్ ఎవరు చేస్తారు అనుకోలేదు. కానీ జగపతి బాబు చెయ్యడం చాలా సంతోషంగా ఉంది. మా టీంకి ఇంకా మా ఆర్టిస్ట్స్ అందరికి థాంక్స్.”

- Advertisement -