గ్రీన్ ఛాలెంజ్‌.. ఆదర్శంగా నిలిచిన గ్రామస్తులు..

270
green challeng

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌ రోజు రోజు ఎంతో ముందుకు దూసుకెళ్తోంది. తాజాగా ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామస్తులు 960 మొక్కలను నాటారు. ఇంటికి 6 చెట్లు చొప్పున 160 కుటుంబాలు మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ గాడ్గె మినాక్షి సుభాష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ గ్రామస్తులతో పాటు సర్పంచ్‌ కూడా మొక్కలు నాటారు. ఇందులో ప్రత్యేకంగా శ్రీకృష్ణ తులసి మొక్కలు నాటారు. తన గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించి గ్రామంలో మొక్కలు నాటిన గ్రామస్తులను రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా అభినందించారు.

MP Santosh Kumar