అక్షయ్ ఫ్యాన్స్‌కి ‘గుడ్ న్యూస్’.. ట్రైలర్

756
Good Newwz
- Advertisement -

బాలీవుడ్‌ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం ‘గుడ్ న్యూస్’ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం. ఈ చిత్రంలో అక్షయ్ కి జోడీగా కరీనా కపూర్.. దిల్జిత్ దొసాంజేకు జోడీగా కియారా అద్వానీ నటించింది. ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై క్రేజీ ఫిలిం మేకర్ కరణ్ జోహార్.. వేరొక నిర్మాత హీరూ జోహార్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రాజ్ మెహతా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

ఇటీవల విడులైన ఈ సినిమా ఫస్టలుక్ మోషన్ పోస్టర్‌తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. ఒకరి భార్య మరొకరి బిడ్డకు జన్మనివ్వాల్సి వస్తే ఎలా వుంటుంది అనే ఆసక్తికరమైన అంశం చుట్టూ ఆద్యందం వినోదాత్మకంగా దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచినట్టు కనిపిస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ 27న న్యూ ఇయర్ కానుకగా విడుదల చేస్తున్నారు.

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఇందులో అక్షయ్ భార్యగా నటిస్తున్న కరీనా కపూర్.. మరో హీరో దిల్జిత్ దొసాంజే బిడ్డకు జన్మనివ్వాల్సి వస్తుంది. అలాగని ఇదేమీ సరోగసీ కానేకాదు. ఒక రకంగా కన్ఫ్యూజన్ సరోగసి అని చెప్పాలి. దిల్జిత్ దొసాంజేకు భార్యగా నటిస్తున్న కియారా అద్వానీ హీరో అక్షయ్ కుమార్ బిడ్డకు జన్మనివ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. డాక్టర్ల పొరపాటు వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది ఆసక్తికరం. పూర్తి స్థాయి హాస్యభరితంగా రూపొందుతున్న ఈ సినిమాతో అక్షయ్- దిల్జిత్- కరీనా- కియారా ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి.

A few days back, the makers of Akshay Kumar and Kareena Kapoor Khan starrer ‘Good Newwz’ dropped a few posters of the film..

- Advertisement -