గొల్లపూడి మారుతీరావు సినీ ప్రస్ధానం…

784
gollapudi
- Advertisement -

ప్రముఖ రచయిత,సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు ఇకలేరు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది.

రచయితగా,నటుడిగా,జర్నలిస్టుగా తెలుగు సాహిత్యాభివృద్ధికి విశేష కృషిచేశారు మారుతీరావు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు,కథలు,నవలలు రాసిన ఆయన ఆంధ్రప్రభ పేపర్ ఉప సంపాదకుడిగా పనిచేశారు.

1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు గొల్లపూడి. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడ్డాయి. మారుతీరావుకు ముగ్గురు కుమారులు.

1963లో డాక్టర్ చక్రవర్తి సినిమాకు స్క్రీన్ ప్లే రాశాడు. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథా రచనకు గాను నంది అవార్డును అందుకున్నారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో నటుడిగా ఆరంగేట్రం చేశారు. తన కెరీర్‌లో దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించాడు.

ముఖ్యంగా గొల్లపూడి నటించిన సంసారం ఒక చదరంగం,తరంగిణి,త్రిశూలం,అసెంబ్లీ రౌడీ,ముద్దుల ప్రియుడు,ఆదిత్య 369 సినిమాలతో మంచి గుర్తింపు పొందారు. వెండితెరపై 5,బుల్లి తెరపై ఒక నంది అవార్డు అందుకున్నారు.

వెండితెరపైనే కాదు బుల్లితెరపై చెరగని ముద్రవేశారు గొల్లపూడి. ఈటీవీ ప్రతిధ్వని కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆయన అన్ని రంగాలకు చెందిన ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు. ఈటీవీ నిర్వహించిన మనసున మనసై అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఇది భార్యాభర్తల కోసం ఉద్దేశించింది. జెమిని టీవీ నిర్వహించిన ప్రజావేదిక, మాటీవీ నిర్వహించిన వేదిక, దూరదర్శన్ హైదరాబాద్ ప్రసారం చేసిన సినీ సౌరభాలు అత్యంత ప్రజాదరణ పొందాయి. గొల్లపూడి మృతితో పలువురు సినీ ప్రముఖలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Maruti Rao was born in a Telugu-speaking Brahmin family on 14 April 1939, in Vizianagaram, Andhra Pradesh, India and graduated from Andhra University, Visakhapatnam, Andhra Pradesh in 1959 specializing in Mathematical Physics

- Advertisement -