భారీగా తగ్గిన పసిడి ధర..

257
gold
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. గత నెల చివరిలో రూ. 40 వేలను తాకిన 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర, ఇప్పుడు భారీగా దిగివచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులతో పాటు స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో, పెట్టుబడిదారులు బులియన్ మార్కెట్ నుంచి వైదొలగుతున్నారని విశ్లేషకులు తెలుపుతున్నారు. బుధవారం ఒక్కరోజులో బంగారం ధర ఇండియాలో 10 గ్రాములకు రూ. 672 తగ్గి, రూ. 37,575కు చేరింది. నిన్నటితో పోలిస్తే, ఇది 1.75 శాతం తక్కువ. ఇదే సమయంలో వెండి ధర కిలోకు ఏకంగా రూ. 1,490 పడిపోయి, రూ. 44,168కి చేరుకుంది.

Gold-Rate

అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే, ఫ్యూచర్స్‌ కమోడిటీ మార్కెట్‌ –నైమెక్స్‌ లో ఔన్స్‌ బంగారం ధర 30 డాలర్లకు పైగా పతనమై, 1,462 డాలర్ల వద్దకు చేరింది. తమ మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి ముగింపు పలుకుతున్నట్టు అమెరికా, చైనా ప్రకటించడంతో చాలామంది ఇన్వెస్టర్లు బులియన్ మార్కెట్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. ఇక నేడు కూడా బంగారం ధర దిగివస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర:
హైదరాబాదులో రూ.38,470
విజయవాడలో రూ.39,100
విశాఖపట్నంలో రూ.39,520
ప్రొద్దుటూరులో రూ.39,150
చెన్నైలో రూ.38,210గా ఉంది.

ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర:
హైదరాబాదులో రూ.36,650
విజయవాడలో రూ.36,250, విశాఖపట్నంలో రూ.36,350
ప్రొద్దుటూరులో రూ.36,270
చెన్నైలో రూ.36,580గా ఉంది.

వెండి కిలో ధర:
హైదరాబాదులో రూ.45,600
విజయవాడలో రూ.47,200
విశాఖపట్నంలో రూ.46,800
ప్రొద్దుటూరులో రూ.47,000
చెన్నైలో రూ.49,200 వద్ద ముగిసింది.

- Advertisement -