స్వల్పంగా తగ్గిన పసిడి ధర..

341
gold rate
- Advertisement -

పసిడి ధర మళ్లీ పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.260 తగ్గింది. దీంతో ధర రూ.39,270కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా కూడా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.120 పడిపోయింది. దీంతో ధర రూ.36,000కు తగ్గింది. ఇకపోతే బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.100 తగ్గింది. దీంతో వెండి ధర రూ.47,400కు దిగొచ్చింది.

gold

 

వివిధ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.39,270, విజయవాడలో రూ.38,600, విశాఖపట్నంలో రూ.38,960, ప్రొద్దుటూరులో రూ.38,600, చెన్నైలో రూ.37,850గా ఉంది.

ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,000, విజయవాడలో రూ.35,750, విశాఖపట్నంలో రూ.36,840, ప్రొద్దుటూరులో రూ.35,780, చెన్నైలో రూ.36,050గా ఉంది.

వెండి కిలో ధర హైదరాబాదులో రూ.43,600, విజయవాడలో రూ.44,500, విశాఖపట్నంలో రూ.44,500, ప్రొద్దుటూరులో రూ.44,500, చెన్నైలో రూ.46,600 వద్ద ముగిసింది.

Gold Rate in Hyderabad Today (10th Dec 2019): Get 22 Carat & 24 Karat gold rate in Hyderabad & last 10 days gold price based on rupees per gram from…

- Advertisement -